అమావాస్య తిథి ప్రత్యేక పరిహారం
నరదృష్టి, అనారోగ్య మరియు తాంత్రిక బాధల నివారణకు...
అతి ప్రాచీన తాంత్రిక మర్మం
మీ కుటుంబ సభ్యులు, బంధువులు లేదా మిత్రులు ఎవరైనా నరదృష్టి, చెడు ప్రయోగాలు, లేదా దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలతో బాధపడుతుంటే, ఈ అమావాస్య రోజున కింది పరిహారం పాటించండి:
పరిహార విధానం:
- బాధపడుతున్న వ్యక్తి వయస్సు ఎన్ని సంవత్సరాలైతే, అన్ని గోమతి చక్రాలను తీసుకోవాలి.
- వాటిని శుద్ధి చేసి, ఒక పసుపు వస్త్రంలో మూట కట్టాలి.
- అర్ధరాత్రి 12 గంటల సమయంలో, ఆ మూటతో వ్యక్తికి 8 సార్లు అపసవ్య దిశలో (Anti-clockwise) దిష్టి తీయాలి.
- తరువాత ఎవరితోనూ మాట్లాడకుండా నాలుగు రోడ్ల కూడలిలో ఆ మూటను వదిలేయాలి.
- తిరిగి వచ్చేటప్పుడు వెనక్కి చూడకూడదు. ఇంటికి వచ్చిన వెంటనే కాళ్ళు, ముఖం కడుక్కుని నిద్రపోవాలి.
ముఖ్య గమనిక:
ఈ పరిహారం చేసే రోజు పూర్తిగా శాకాహారం మాత్రమే తీసుకోవాలి. రోజంతా వీలైనన్ని సార్లు "ఓం క్లీం మహా కాళికాయై స్వాహ" అనే మంత్రాన్ని పఠించడం అత్యంత శుభదాయకం.
🚩 సనాతన హిందూ ధర్మం 🚩
