Ads Area

వివిధ రకాల కాలసర్పదోషాలు

0

వివిధ రకాల కాలసర్పదోషాలు

1. అనంతకాల సర్పదోషం లగ్నం నుండి ఏడవస్థానం వరకు రాహు, కేతుగ్రహాల మధ్య మిగతా 7గ్రహాలు ఉంటే దీనిని అనంతకాల సర్పదోషం అంటారు. దీనివలన వైవాహిక జీవితంలో, ఆరోగ్య విషయంలో సమస్యలు ఉంటాయి.
2. గుళిక కాల సర్పదోషం జాతకచక్రంలో లగ్నం నుండి రెండవ స్థానము నుండి ఎనిమిదవ స్థానము వరకు రాహుకేతువుల మధ్య మిగతా గ్రహాలు ఉంటే దీనివలన ఆర్థిక, కుటుంబ సమస్యలు ఉంటాయి.
3. వాసుకి కాలసర్పదోషం మూడవస్థానం నుండి తొమ్మిదవ స్థానం వరకు రాహు, కేతుగ్రహాల మధ్య మిగతా 7 గ్రహాలు ఉంటే దీనివలన సోదర, బంధువర్గం వారితో సమస్యలు ఉంటాయి.
4. శంఖపాల కాలసర్పదోషం నాల్గవస్థానం నుండి పదవస్థానం వరకు రాహుకేతువుల మధ్య మిగతా 7 గ్రహాలు వుంటే దీనివలన తల్లి, స్థల, గృహ, వాహనముల సమస్యలు ఉంటాయి.
5. పద్మ కాలసర్పదోషం ఐదవస్థానం నుండి 11వస్థానం వరకు రాహుకేతువుల మధ్య మిగతా 7 గ్రహాలు ఉంటే దీనివలన అనారోగ్యం, ఋణం, శత్రువుల సమస్యలు ఉంటాయి.
6. మహాపద్మ కాలసర్పదోషం ఆరవస్థానం నుండి పన్నెండవ స్థానం వరకు రాహు కేతువుల మధ్య మిగతా 7 గ్రహాలు ఉంటే దీనివలన వ్యాపారంలోను, జీవిత భాగస్వామితోను సమస్యలు ఉంటాయి.
7. తక్షక కాలసర్పదోషం ఏడవ స్థానం నుండి లగ్నం వరకు రాహు, కేతువులు మధ్య మిగతా 7 గ్రహాలు ఉంటే దీనివలన వ్యాపారంలో, జీవితభాగస్వామితో సమస్యలు ఎదురవుతాయి.
8. కర్కోటక కాలసర్పదోషం ఎనిమిదవ స్థానం నుండి రెండవ స్థానం వరకు రాహు, కేతువల మధ్య మిగతా 7 గ్రహాలు ఉంటే దీనివలన భార్య వలన, ప్రమాదాల వలన సమస్యలు ఉంటాయి.
9. శంఖచూడ కాలసర్పదోషం తొమ్మిదవ స్థానం నుండి మూడవస్థానం వరకు రాహు, కేతువుల మధ్య మిగతా 7 గ్రహాలు వుంటే దీనివలన తండ్రి, నాస్తికత్వం, దురదృష్టం, గురువువలన సమస్యలు ఉంటాయి.
10. ఘటక కాలసర్పదోషం పదవస్థానం నుండి నాల్గవ స్థానం వరకు రాహు, కేతువుల మధ్య మిగతా 7 గ్రహాలు వుంటే దీనివలన ఉద్యోగంలోను, వ్యాపారంలోను సమస్యలు ఉంటాయి.
11. విపక్ష కాలసర్పదోషం పదకొండవ స్థానం నుండి ఐదవస్థానం వరకు రాహు, కేతువుల మధ్య మిగతా 7 గ్రహాలు ఉంటే దీనివలన లాభనష్టాలలోను, వ్యాపార లావాదేవీలలోను సమస్యలు ఉంటాయి.
12. శేషనాగ కాలసర్పదోషం పన్నెండవ స్థానం నుండి ఆరవస్థానం వరకు రాహు, కేతువుల మధ్య మిగతా 7 గ్రహాలు ఉంటే దీనివలన అధిక ఖర్చువలన, శత్రువుల వలన సమస్యలు ఉంటాయి.
కాలసర్పదోషానికి నివారణామార్గాలు
🕉️ శ్రీకాళహస్తి వెళ్ళి రాహు, కేతు సర్పదోష పరిహారము చేయించుకొని, మినుములు, కందులు, ఉలవలు దానం చేయడం, దుర్గ, పాతాళ వినాయకుని పూజించడం.
🕉️ బంగారం లేదా వెండితో నాగపడగ చేయించి, ఏకాదశ రుద్రాభిషేకానంతరం ఆ పడగను బ్రాహ్మణులకు దానం ఇవ్వడం ద్వారా దోషం పోతుంది.
🕉️ వెండితో సర్పాకార ఉంగరం చేయించి వేలికి ధరించడం.
🕉️ ఏదైనా సుబ్రహ్మణ్య క్షేత్రంలో 108 ప్రదక్షిణలు చేసి దేవునికి వెండి పడగ సమర్పించడం.
🕉️ కుజ, రాహు, కేతు గ్రహాలకు విడివిడిగా జపాలు చేయించి గ్రహదానాలు చేయడం ద్వారా కాలసర్పదోషం నివారణ అవుతుంది.

Post a Comment

0 Comments

Top Post Ad

Bottom Post Ad

Ads Area