GET MORE DETAILS

తరగతులు ఎక్కువ - గురువులు తక్కువ : : తరగతి గదిలో విద్యార్థులనే కాపలా ఉంచి నియంత్రిస్తూ...

 తరగతులు ఎక్కువ - గురువులు తక్కువ : : తరగతి గదిలో విద్యార్థులనే కాపలా ఉంచి నియంత్రిస్తూ...



మనబడి నాడు-నేడులో భాగంగా ప్రభుత్వ పాఠశాలలను తీర్చిదిద్దుతున్నప్పటికీ.. పాఠాలు చెప్పే గురువులు సరిపడినంత మంది లేకపోవడంతో విద్యార్థులకు ఇబ్బందులు తప్పడంలేదు. విజయవాడ గ్రామీణం కుందావారి కండ్రికలో మండల పరిషత్‌ ప్రాథమికోన్నత పాఠశాలలో 1 నుంచి 8 తరగతి వరకు 210 మంది విద్యార్థులు చదువుతున్నారు. ఇక్కడ బోధించేది ఐదుగురు ఉపాధ్యాయులే. 6,7,8 తరగతులకు పాఠాలు చెప్పేందుకు స్కూల్‌ అసిస్టెంట్‌ ఉపాధ్యాయులే లేరు. ఉన్న ఒక్క స్కూల్‌ అసిస్టెంట్‌ ప్రధానోపాధ్యాయురాలు కావడం.. విద్యార్థుల హాజరు, మరుగుదొడ్లు, భోజనాలు ఇలా రకరకాల ఫొటోలు ప్రభుత్వ యాప్‌లో అప్‌లోడ్‌ చేయడం, ఇతర పనులతోనే సమయం సరిపోతుంది. ఒకరిద్దరు ఉపాధ్యాయులు సెలవు పెడితే.. మిగతా వారే రెండేసి తరగతులను ఒక్కటిగా చేసి చూడాల్సి వస్తోంది.

- ఈనాడు, అమరావతి

Post a Comment

0 Comments