GET MORE DETAILS

పీఆర్సీపై 72 గంటల్లో సీఎం జగన్‌ నిర్ణయం : సీఎస్ సమీర్ శర్మ

పీఆర్సీపై 72 గంటల్లో సీఎం జగన్‌ నిర్ణయం : సీఎస్ సమీర్ శర్మసీఎం జగన్‌తో సీఎస్‌ సమీర్‌ శర్మ భేటీ అయ్యారు. సీఎంకు పీఆర్సీ నివేదికను ఆయన అందజేశారు. ఈ భేటీ అనంతరం సమీర్‌శర్మ మీడియాతో మాట్లాడుతూ పీఆర్సీ నివేదికను ప్రభుత్వ వెబ్‌సైట్‌లో పెడతామన్నారు. ఉద్యోగ సంఘాలకు కూడా నివేదిక పంపిస్తామని, సీఎం జగన్‌కూ పీఆర్సీపై నివేదిక ఇచ్చామని చెప్పారు. 72 గంటల్లో సీఎం జగన్‌ నిర్ణయం తీసుకుంటారని, ఈ పీఆర్సీ అమలుతో ప్రభుత్వంపై రూ. 10 వేల కోట్ల భారం పడుతుందన్నారు. 27 శాతం ఫిట్‌మెంట్‌ ఇవ్వాలని కమిటీ సూచించినట్లు తెలిపారు. పీఆర్సీ ఫిట్‌మెంట్‌పై సీఎంకు 11 ప్రతిపాదనలు ఇచ్చామని, 2018 నుంచి పీఆర్సీ అమలవుతున్నట్లు సీఎస్‌ సమీర్‌ శర్మ పేర్కొన్నారు.

Post a Comment

0 Comments