GET MORE DETAILS

శ్రీ వేంకటేశ్వర చరిత్ర - కలియుగంలో ప్రత్యక్ష దైవంగా కొలవబడుచున్న శ్రీ వేంకటేశ్వరుని చరిత్రను అందరూ తెలుసు కోవాలి.

శ్రీ వేంకటేశ్వర చరిత్ర - కలియుగంలో ప్రత్యక్ష దైవంగా కొలవబడుచున్న శ్రీ వేంకటేశ్వరుని చరిత్రను అందరూ తెలుసు కోవాలి. 1. నైమిశారణ్యం :    

నైమిశారణ్యంలో తపస్సు చేసుకుంటున్న మును లందరు సూతుడు అనే ముని చెప్పగా పదునెనిమిది పురాణములు విన్నారు. శౌనకుడు  శ్రీవేంకటేశ్వరుని చరిత్రను వినిపించ వలసినదిగా సుాతుడిని కోరగా వినిపించసాగాడు.

2. బ్రహ్మలోకం :           

ఒక నాడు నారదుడు బ్రహ్మను దర్శించు కొనుటకు బ్రహ్మలోకం చేరుకున్నాడు.బ్రహ్మ సభను చేరుకున్న నారదుని ఉద్దేశించి "నారదా కలియుగంలో భక్తులకు దర్శనం ఇచ్చుటకు గాను మహావిష్ణువు భుాలోకంలో అవతరించునట్లు చేయవలసి ఉన్నది. మానవుల లోక కళ్యాణం కోసం అవసరం.అది సంభవింప జేయుట నీకే సాధ్యం" అని పలికాడు. నారదుడు తనకు అప్పగించిన మహాకార్యమునకు సంతోషపడుతుా నారాయణ నారాయణ అంటుా సెలవు తీసికొని భుాలోకానికి బయలు దేరాడు.

3. గంగాతీరంలో యజ్ఞం :                      

కశ్యపుడు ఇతర మునులు కలిసి లోక కళ్యాణంకోసం యజ్ఞం చేయతలపెట్టినారు. నారదుడు అచటికి చేరుకుని మునులతో ఇలా అన్నాడు. "మునులారా మీరు చేయుచున్న యజ్ఞఫలం త్రిముార్తులైన బ్రహ్మ విష్ణు మహేశ్వరులలో ఎవరికి చెందుతుంది" అని ప్రశ్నించాడు. మును లందరు తీవ్రమైన చర్చలు జరిపి కుాడా వారిలో సత్వగుణ సంపన్నుడెవరో తేల్చుకోలేకపోయారు. చివరికి అది నిర్ణయించడానికి భృగుమహర్షికి అట్టి బాధ్యతను అప్పగించారు.

4. భృగువు త్రిముార్తులను పరీక్షించుట :              

భృగుమహర్షి తనకు అప్పగించిన కార్యమును నెరవేర్చుటకై ముందుగా బ్రహ్మను దర్శించుటకు వెళ్లాడు. అచట బ్రహ్మ సమస్త మునులు దేవగణము గరుడ గంధర్వులకు వేద ధర్మాన్ని వివరిస్తున్నాడు.                    

భృగుమహర్షి అక్కడ ఉన్నవారికి గాని బ్రహ్మకు గాని నమస్కరించకుండా వెళ్లి కుార్చున్నాడు. ఇది గమనించిన బ్రహ్మ కోపంతో "భృగుమహర్షి ధర్మశాస్త్రము తెలిసిన నీవు సభా మర్యాద తెలియకుండా అహంకారముతో ఎవరినీ గౌరవంతో పలుకరించకుండా పీఠముపై కుార్చుండడం నీ అజ్ఞానముగా భావించాలని ఉంటుంది" అన్నాడు. భృగుమహర్షి తనలో తాను ఇట్టి ఆత్మాభిమానం గర్వము రాజసగుణం కలవారిది కనుక బ్రహ్మది రజోగుణం అని నిర్ణయించుకుని మారు మాట్లాడకుండా సభ నుండి వెళ్లి పోయాడు.                     

మహేశ్వరుని గురించి  తెలుసుకుందామని కైలాసం చేరుకోగా శివుడు పార్వతితో ఏకాంతంగా ఉన్నాడని తెలిసింది.ఇదే సరిఅయిన సమయమని తలచి ద్వారపాలకులు వారించినా లోనికి వెళ్లాడు. భృగుమహర్షిని చుాసిన పార్వతి సిగ్గుతో ప్రక్కకు జరిగింది.శివుడు తన కోపం ఆపుకోలేక "మర్యాద తెలియని ముార్ఖుని వలె ప్రవర్తించావు. అనుమతి లేకుండా భార్యాభర్తల ఏకాంత మందిరానికి రావచ్చునా!నేను శపించిన నాశనం అగుదువు.అయినా  దయతలచిని పొమ్ము" అని నిందించాడు.    

ఇట్టి కోపం ఆగ్రహము శివునిలో చుాసిన భృగువు శివుని తామసగుణం గలవానిగా నిర్ణయించుకున్నాడు.         శ్రీమహావిష్ణువును పరీక్షించుటకుగాను వైకుంఠం చేరుకున్నాడు.భృగుమహర్షి అచటికి చేరుకునే సమయానికి శ్రీహరి శేషపాన్పుపై  ఉండగా లక్ష్మీదేవి పాదసేవ చేయుచున్నది. భృగుమహర్షి వడి వడిగా వెళ్లి విష్ణువు రొమ్ముపై కాలితో తన్నాడు. శ్రీహరి శాంతముగా పాన్పునుండి దిగి భృగువు పాదములను పట్టుకుని "మీ పాదధుాళి సోకి ధన్యుడనైతిని.మీ కోమలమైన పాదమునకు నొప్పి కలిగినదేమో" అంటుా అతని పాదమున నున్న నేత్రమును నొక్కివేసాడు. "మీరు వచ్చిన కార్యము తీరినందులకు సంతోషము" అన్నాడు. అందులకు భృగుమహర్షి "పరమాత్ములైన మిమ్ములను  పరీక్షించదలచి తొందరపాటు లో తన్నితినని క్షమించుమని" వేడుకున్నాడు. శ్రీమహావిష్ణువు భృగుమహర్షితో  విచారపడకుమని మీ కార్యము నెరవేరినదని చెప్పి పంపించాడు. భృగుమహర్షి మునులను చేరుకుని శ్రీ మహావిష్ణువు శాంతస్వరుాపుడని సత్వగుణ సంపన్నుడని యజ్ఞ ఫలం అతనికే చెందవలెనని తెలిపాడు.

5. లక్ష్మీదేవి అలక - భుాలోకానికి పయనం :                      

భృగుమహర్షి  రొమ్ముపై కాలితో తన్నిననుా ఏమీ అనకుండా ప్రశాంతంగా ఉండి అతని పాదములను తాకిన శ్రీహరి పై కోపంతో లక్ష్మీదేవి ఇలా అన్నది. "నాథా! మీ వక్షస్థలం నా నివాసం.అయినా మీరు భృగువును కోపగించలేదు.మీతో పాటుగా నాకు తీరని అవమానం జరిగింది.కనుక నేను మీతో ఉండను." శ్రీ హరి అనునయిస్తుా "లక్ష్మీదేవి! కారణం లేకుండా నా భక్తుడు అలా ప్రవర్తించడు.భక్తునికి భగవంతునికి మధ్యగల సంబంధం నిగుాఢమైనది." అన్నాడు. అయినా లక్ష్మీదేవి శాంతించకుండా వైకుంఠం వదిలి భుాలోకం చేరింది.అడవులు కొండలు గుట్టలు తిరిగి చివరికి గోదావరి నదీ తీరంలో కొల్లాపురం వద్ద పర్ణశాల కట్టుకొని తపస్సు చేసుకోసుకోసాగింది.

6. లక్మీదేవి వియోగంతో శ్రీ హరి భుాలోకం చేరుట :            

లక్ష్మీదేవి లేని వైకుంఠంలో శ్రీ హరి ఉడలేకపోయాడు. లక్ష్మీదేవిని వెదుకుతూ భుాలోకం చేరాడు. ఇక్కడ అనేక చోట్ల వెదుకుతూ విలపిస్తూ చివరికి శేషాద్రి కొండపైకి చేరాడు. అలసిపోయి కృశించి పోయాడు. ఒక చెట్టుక్రింద పుట్టలో తలదాచుకున్నాడు.

7. ఆవు దుాడలుగా మారిన బ్రహ్మ - శివుడు :                     

పుట్ట లోనున్న  శ్రీహరి కృశించిపోవుట గమనించిన నారదుడు బ్రహ్మతో విన్నవించాడు.బ్రహ్మ శివునితో కలిసి వెళ్లి లక్ష్మీదేవిని కలిసారు.పరిస్థితిని వివరించారు. శ్రీహరికి పాలు అందజేయుటకుగాను తాము ఆవుదుాడలుగా మారతామని మమ్ములను చోళరాజుకు విక్రయించ వలసిందిగా కోరారు. లక్మీదేవి అంగీకరించి బ్రహ్మ శివుడు  ఆవుదుాడలుగా మారిన తర్వాత చోళరాజుకు విక్రయించి వెళ్లిపోయింది.

8. గాయపడిన విష్ణుమూర్తి - చోళరాజును శపించుట :    

చోళరాజు భార్య ఆవు దుాడలు ముచ్చటగా ఉండడం చూసి ఆవుపాలను పితికి ప్రత్యేకముగా తనకు తీసుకరావలసిందిగా మందను కాసే గోపాలుని కోరింది. గోపాలుడు అంగీకరించాడు. ఆవు ప్రతిరోజూ మందనుండి వేరయి దుారంగా నున్న పుట్ట వద్దకు వెళ్లి అందులో పాలు విడిచేది.పుట్టలోనున్న విష్ణుముార్తి వాటిని త్రాగేవాడు.ఇంటికి చేరుకున్న ఆవు పాలు ఇవ్వకపోవడంతో రాణిగారికి పాలు అందలేదు. రాణి కోపంతో గోపాలుని శిక్షించవలసి ఉంటుందని హెచ్చరించింది. మరుసటిరోజు గోపాలుడు ఆవును గమనించాడు.ఆవు మందనుండి దుారంగా వెళ్లి పుట్టలో పాలు విడువడం చుాసి గొడ్డలితో వేటు వేయగా వెంటనే పుట్టలో నున్న విష్ణుముార్తి పైకి రాగానే తలకు గొడ్డలి తగిలింది. గాయమైరక్తం కారసాగింది.అది చుాసిన గోపాలుడు ముార్ఛపోయాడు. విషయం తెలుసుకున్న చోళరాజు పుట్ట వద్దకు చేరుకున్నాడు.శ్రీహరి పిశాచివి కావలసిందిగా రాజును శపించాడు. చోళరాజు క్షమించమని వేడుకున్నాడు. "మరుజన్మలో ఆకాశరాజుగా జన్మిస్తావు.నీ కుమార్తెను నాకిచ్చి పరిణయం చేసి వజ్రకిరీటం సమర్పిస్తావు.నీకు శాపవిమోచనం కలుగుతుంది. " అని తెలిపాడు.

9. శ్రీహరి వరాహస్వామిని దర్శించుట :                     

శ్రీహరి తనకు తగిలిన గాయము మాన్పించుకొనుటకు ప్రయత్నం చేయుచుండెను.ఇది తెలిసిన దేవ గురువు బృహస్పతి ఔషదము తెలిపెను.ఔషధము కొరకై శ్రీహరి అరణ్యములో వెదుకుచుండగా వరాహస్వామి ఆశ్రమము కన్పించెను.వరాహస్వామి శ్రీహరిని గుర్తించి భుాలోకం వచ్చుటకు కారణం అడుగగా అన్ని విషయములు వివరించి తనకు కొండపై ఉండుటకు కొంత స్థలం కావలెనని కోరినాడు.వరాహస్వామి సంతోషముతో అంగీకరించినాడు.శ్రీహరి అందుకు బదులుగా కలియుగంలో తనను దర్శించే భక్తులు ముందుగా వరహస్వామిని దర్శించి నైవేద్యము కానుకలు సమర్పించిన తర్వాతనే తనను దర్శించగలరని ఆవిధంగా ఋణం తీర్చుకోగలనని తెలిపాడు. వరహస్వామి సంతసించి తన భక్తురాలైన వకుళాదేవి వద్ద ఉండి తగిన ఉపచారములు పొందుమని చెప్పెను. అందుకు అంగీకరించి శ్రీహరి వకుళాదేవి యొద్దకు  చేరుకున్నాడు.

10. వకుళాదేవి ఆదరణ :                  

శ్రీహరి వకుళాదేవి  వద్దకు చేరగానే వకుళాదేవి ప్రేమతో చేరదీసింది.గాయమును గమనించి వివరాలు అడిగింది.శ్రీహరి తనకు ఎవరును లేరని కొన్ని పరిస్థితుల వలన గాయం అయినదని తెలిపాడు. వకుళాదేవి తనకు పిల్లలు లేరని వరహస్వామి ఆశ్రమంలో స్వామిని సేవిస్తుా ఉన్నానని తెలిపింది.శ్రీహరి గాయమునకు కట్టుకట్టి తన కుమారునిగా ఉండి పొమ్మని కోరింది.శ్రీహరిని శ్రీనివాసుడు అనే పేరుతో పిలువ సాగింది.శ్రీనివాసుడు సంతోషంతో వకుళాదేవి ఆశ్రమములో ఉండిపోయాడు.

Post a Comment

0 Comments