GET MORE DETAILS

సుపరిపాలన దినోత్సవం - గుడ్ గవర్నెన్స్ డే (డిసెంబర్, 25)

 సుపరిపాలన దినోత్సవం - గుడ్ గవర్నెన్స్ డే (డిసెంబర్,  25)



భారతదేశం ఏటా డిసెంబర్,  25 తేదీన  ప్రభుత్వంలో జవాబుదారీతనం గురించి భారతీయ ప్రజలలో అవగాహన పెంపొందించడం ద్వారా ప్రధాన మంత్రి వాజ్‌పేయిని గౌరవించటానికి 2014లో గుడ్ గవర్నెన్స్ డే స్థాపించబడింది.

23 డిసెంబర్ 2014న, తొంభై ఏళ్ల  మాజీ ప్రధాన మంత్రి అటల్ బిహారీ వాజ్‌పేయి, మరియు పండిట్ మదన్ మోహన్ మాలవ్యలను (మరణానంతరం) భారతదేశ అత్యున్నత పౌర పురస్కారం భారత రత్న గ్రహీతలుగా ప్రకటించారు , భారత రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ .

ఈ ప్రకటన తరువాత, కొత్తగా ఎన్నికైన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ పరిపాలన , మాజీ ప్రధాని జన్మదినాన్ని ఇకపై భారతదేశంలో ప్రతి సంవత్సరం సుపరిపాలన దినోత్సవంగా జరుపుకోవాలని నిర్ణయించారు. 

జననం :

అటల్ బిహారీ వాజ్‌పేయి డిసెంబర్ 25, 1924లో గ్వాలియర్‌లో జన్మించారు.

ఆర్ఎస్ఎస్‌కు మద్దతు :

యువకుడిగా ఉన్నప్పుడు బ్రిటిష్ కల్నల్ రూల్‌ను వ్యతిరేకించి వాజ్‌పేయి జైలుకెళ్లారు. కమ్యూనిజంతో కొన్నాళ్లు కాలం గడిపిన వాజ్‌పేయి ఆ తరవాత రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ (ఆర్ఎస్ఎస్), జన్ సంఘ్‌కు మద్దతు పలికారు.

స్వాతంత్య్ర సమరయోధుడిగా...

క్విట్ ఇండియా ఉద్యమం(1942-1945)లో పాల్గొని స్వాతంత్ర్య సమరయోధుడిగా తన రాజకీయ ప్రస్థానాన్ని వాజ్‌పేయి మొదలుపెట్టారు. ఒక కమ్యూనిస్టుగా వాజ్‌పేయి తన ప్రయాణాన్ని మొదలుపెట్టినా ఆర్ఎస్‌ఎస్‌లో సభ్యత్వం తీసుకొని హిందుత్వాన్ని, హిందూ జాతీయవాదాన్ని వినిపించి భారత రాజకీయాల్లో కీలకపాత్ర పోషించారు.

'లా’ను మధ్యలోనే వదిలిపెట్టి...

1950ల్లో ఆర్ఎస్ఎస్ మ్యాగజైన్‌ను నిర్వహించడానికి వాజ్‌పేయి తన న్యాయశాస్త్ర (లా) విద్యాభ్యాసాన్ని మధ్యలోనే ఆపేశారు. వాజ్‌పేయి రాజకీయ బీజాలు కూడా ఆర్ఎస్ఎస్‌లోనే పడ్డాయి.

శ్యామ ప్రసాద్ ముఖర్జీకి ప్రధాన అనుచరుడు :

భారతీయ జన సంఘ్‌ వ్యవస్థాపకుడు శ్యామ ప్రసాద్ ముఖర్జీకి వాజ్‌పేయి ప్రధాన అనుచరుడు.

వాజ్‌పేయిపై ముఖర్జీ ప్రభావం :

1953లో కశ్మీర్‌లో ఆమరణ నిరాహార దీక్ష చేయడానికి వెళ్లినప్పుడు వాజ్‌పేయి.. ముఖర్జీ వెన్నంటే ఉన్నారు. కశ్మీర్‌కు ప్రత్యేక ప్రతిపత్తి కల్పించడాన్ని వ్యతిరేకిస్తూ ముఖర్జీ ఆమరణ నిరాహార దీక్షకు పూనుకున్నారు. ఒక రాష్ట్రానికి ప్రత్యేక జెండా, ప్రధానమంత్రి ఉండటాన్ని ముఖర్జీ తీవ్రంగా నిరసించారు. ఒకే దేశంలో రెండు రాజ్యాంగాలు, ఇద్దరు ప్రధానమంత్రులు, రెండు జాతీయ పతాకాలు ఉండటాన్ని సహించలేమని పేర్కొన్నారు. అయితే ముఖర్జీని నిరాహారదీక్ష చేయనివ్వకుండా అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం ఆయన్ని అరెస్టు చేసింది. ఆ తరవాత కొన్ని వారాలకు ఆయన మరణించారు. ముఖర్జీ పోరాటం ఫలితంగా కశ్మీర్ వెళ్లడానికి గుర్తింపుకార్డు నిబంధనను ప్రభుత్వం తొలగించింది. ఈ పరిణామాలన్నీ యువ వాజ్‌పేయిపై ప్రభావం చూపాయి.

పార్లమెంట్‌కు ఎన్నిక :

వాజ్‌పేయి తొలిసారి 1957 పార్లమెంట్ ఎన్నికల్లో విజయం సాధించారు.

10 సార్లు లోక్‌సభకు...

వాజ్‌పేయి 1957 నుంచి 2009 వరకు మొత్తం 10 సార్లు లోక్‌సభకు ప్రాతినిధ్యం వహించారు.

ఐదేళ్లపాటు ప్రధానిగా ఉన్న తొలి కాంగ్రెసేతర నేత:

బీజేపీ తొలి అధ్యక్షుడిగా నియమితులైన వాజ్‌పేయి.. పూర్తిగా ఐదేళ్లపాటు ప్రధానిగా ఉన్న తొలి కాంగ్రెసేతర నేతగానూ రికార్డుకెక్కారు.

Post a Comment

0 Comments