GET MORE DETAILS

"తక్షణ శక్తికి తాజా ముంజలు"

 "తక్షణ శక్తికి  తాజా ముంజలు"




★ ఐస్ యాపిల్స్ గా  పిలిచే  తాటి ముంజలు  వేసవిలో  విరివిగా  లభిస్తాయి.  వీటిలో  పోషకాలు  మెండు..  వీటిలోని  తియ్యటి నీళ్లు  శరీరానికి కావాల్సిన  చల్లదనాన్ని  అందిస్తాయి.  చిన్నారులు,  వృధ్ధులకు  ఇవి  చాలా  మేలు  చేస్తాయి.

★ ఈ ముంజల్లోని  అధిక నీరు...  శరీరాన్ని  చల్లబరచడంతో  పాటు  చర్మం  తాజాగా  ఉండేందుకు  దోహదం  చేస్తుంది.  ముంజులు  శరీరంలోని  అలసటను  తొలగించి  తక్షణ  శక్తిని  అందిస్తాయి.

★ కొంచెం  ముదిరిన  ముంజుల్లో  నీరు  ఎక్కువగా  ఉంటుంది.  గర్భిణులు  తింటే  మలబధ్ధకం  సమస్య  తగ్గుతుంది.  అలాగే  కడుపులో  మంట  కూడా.

★ ఈ పండ్లు  తక్కువ  కెలోరీలను  కలిగి  ఉంటాయి.  బరువు  తగ్గాలనుకునేవారికి  చక్కటి  ఆహారం.  ఎండ  తీవ్రత  వల్ల వికారం, వాంతులవుతున్నప్పుడు  తింటే  చాలా  ఉపశమనంగా  ఉంటుంది.  ఇవి త్వరగా  జీర్ణమవుతాయి.  పొటాషియం  లాంటి లవణాలు  వీటి నుంచి  లభిస్తాయి.  వీటిని  తీసుకుంటే   డీహైడ్రేషన్  సమస్య  ఉత్పన్నం  కాదు.

Post a Comment

0 Comments