ఇవి తింటే సమస్యలు దూరం...!
మహిళల్ని మూత్ర సంబంధిత సమస్యలూ, మూత్రపిండాల్లో రాళ్ల వంటివి కొ న్నిసార్లు బాధిస్తుంటాయి. అందుకే రోజూ తీసుకొనే ఆహారంలో మూత్రపిండాలకు మేలు చేసే కాయగూరలు అందేలా జాగ్రత్తపడటం మంచిది.
క్యాబేజీ: దీనిలో విటమిన్ కె, విటమిన్ సి, పీచు అధికం. ఇవి బరువుని అదుపులో ఉంచి, రోగనిరోధక శక్తిని పెంచుతాయి. మూత్రపిండాల్లోని వ్యర్థాలను బయటకు పంపుతాయి. క్యాలిఫ్లవర్ కూడా మూత్రపిండాలను శుభ్రపరచడంలో కీలకపాత్ర పోషిస్తుంది.
ఉల్లిపాయలు: ఉల్లిపాయల్ని తరచూ ఆహారంలో తీసుకోవడం వల్ల మూత్రపిండాలకు రక్తప్రసరణ సక్రమంగా ఉంటుంది. రాళ్లు ఏర్పడినా వాటిని దూరం చేయడానికి దోహదం చేస్తాయి.
వెల్లుల్లి, క్యారెట్: వెల్లుల్లిలో యాంటీ ఆక్సిడెంట్లు అధికం. ఇవి మూత్రపిండాల్లో తలెత్తే ఇన్ఫెక్షన్లను తగ్గిస్తాయి. ప్రతిరోజూ ఓ క్యారెట్ తింటే, లేదంటే గ్లాసు రసం తీసుకుంటే మూత్రపిండాలకు చాలా మంచిది.
ముల్లంగి: దీనిలో పోషకాలూ, ఔషధ గుణాలూ ఎక్కువ. కెలొరీలు తక్కువ. దీన్ని తరచూ తీసుకోవడం వల్ల మూత్రపిండాలు శుభ్రపడతాయి. మూత్రసంబంధిత ఇన్ఫెక్షన్లు ఉన్నవారు దీన్ని ఎంత ఎక్కువగా తీసుకుంటే అంత మంచిది.
0 Comments