GET MORE DETAILS

జ్యోతిష్యశాస్త్రం మనం ఈరోజు అభ్యశిస్తున్నామంటే అది ఎందరో గురువుల కృపాలబ్ధం

 జ్యోతిష్యశాస్త్రం మనం ఈరోజు అభ్యశిస్తున్నామంటే అది ఎందరో గురువుల కృపాలబ్ధం



అటువంటి వారిలో జ్యోతిషశాస్త్ర ప్రవక్తుకులని పిలువబడినవారు 18మంది.

 కశ్యప వచనము ప్రకారము వారిపేర్లు క్రింది విధంగా ఉన్నాయి.

సూర్యః పితమహోవ్యాసో వసిష్టోత్రిః పరాశరః! 

కశ్యపో నారదో గర్గో మరిచిర్మను రంగిరాః!! 

రోమశః పౌలిశశ్చైవ చ్యవనో యవనోభృగుః! 

సౌనకోశ్ఠా దశాశ్చైతే జ్యోతిశాస్త్ర ప్రవర్తకాః!! 

1.సూర్యుడు, 2.బ్రహ్మ, 3.వ్యాసుడు, 4.వశిష్ఠుడు, 5.అత్రి, 6.పరాశరుడు, 7.కశ్యపుడు, 8.నారదుడు, 9.గర్గుడు, 10.మరీచి, 11.మనువు, 12.అంగీరసుడు, 13.రోమశుడు, 14.పౌలిశుడు, 15.చ్యవనుడు, 16.యవనుడు, 17.భృగువు, 18.సౌనకుడు 

వీరు 18మందీ జ్యోతిషశాస్త్ర ప్రవక్తకులు. 

మానవుని నిత్యజీవితంలో అంతర్భాగంగా జ్యోతిష శాస్త్రాన్ని ప్రవర్తింపచేసినవారు కనుక వీరిని జ్యోతిషశాస్త్ర ప్రవక్తకులు అన్నారు. 

జ్యోతిషాన్ని అధ్యయనం చేసేవారికి వీరు ప్రాతఃస్మరణీయులు.

Post a Comment

0 Comments